Narayana Swamy : నోరు జారాడు.. జగన్ భూకబ్జాదారులకు నాయకుడు డిప్యూటీ సీఎం కామెంట్
NQ Staff - June 29, 2022 / 10:55 AM IST

Narayana Swamy : ప్రస్తుతం ఏపీలో రాజకీయం చాలా హాట్ హాట్‌గా నడుస్తుంది. వైసీపీ, టీడీపీల యుద్దం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఛాన్స్ దొరికితే చాలా ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు. అయితే కొన్ని సార్లు సొంత పార్టీ వాళ్లే నోరు జారి తమ పార్టీ నాయకులని తిట్టుకుంటున్నారు. దీనిని ప్రతిపక్షాలు క్యాష్ చేసుకొని వీడియొలు వైరల్ చేస్తుంటాయి.

ap deputy cm narayana swamy viral comments on jagan
బుక్కయ్యాడుగా..
ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి తాజాగా నోరు జారారు. తమ పార్టీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆయన భూకబ్జాదారులకు నాయకుడిగా అభివర్ణించారు. అంతేకాకుండా జగన్ మాట్లాడేది అన్యాయమని, ప్రజలు ఇప్పటికైనా ఆలోచించి మేల్కోనాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ మేరకు తిరుపతి వేదికగా జరిగిన పార్టీ ప్లీనరీలో నారాయణ స్వామి నోరు జారారు.
నారాయణ స్వామి నోరు జారిన వీడియోను పట్టేసిన టీడీపీ… ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. నిజం నిప్పులాంటిది ఎక్కువ సేపు నోట్లో దాచుకోలేరు మరి అంటూ సదరు వీడియోకు టీడీపీ ఓ కామెంట్‌ను జత చేసింది. అంతేకాకుండా జగన్ పని అయిపోయింది అంటూ ఓ హ్యాష్ ట్యాగ్‌ను కూడా సదరు వీడియోకు జత చేసింది.
ఇక ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మహిళ లోకానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారని…వై.ఎస్ ఆర్ చావుకు సోనియా గాంధీ నే కారణం అయ్యిందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తప్పుడు కేసులు తో నాడు జగన్ మోహన్ రెడ్డి ని జైలుకు పంపించిందని సోనియా గాంధీ పై నిప్పులు చెరిగారు.
చంద్రబాబు మ్యానిఫెస్టోలో ఎన్నో వాగ్ధానాలు చేశాడు.. ఏది అమలు చేయలేదు..గడప గడపకు ఇంటికి వెళ్తుంటే ప్రతి కుటుంబం స్వాగతీస్తోందని పేర్కొన్నారు. ఎల్లో మీడియా పప్పు బెల్లం పంచుతున్నారు అంటున్నారు,చంద్రబాబు ఏనాడైనా బిసిలను రాజ్యసభకు పంపించారా..? అని నిలదీశారు నారాయణ స్వామి.
జగన్ రెడ్డి భూకబ్జాదారులకు నాయకుడని, జగన్ మాట్లాడేది అన్యాయమని, కాబట్టి ప్రజలు ఇప్పటికైనా ఆలోచించి మేల్కొనాలని ఏకంగా డిప్యూటీ సిఎం నారాయణస్వామి తిరుపతిలో అన్న మాటలు ఇవి. నిజం నిప్పులాంటిది ఎక్కువ సేపు నోట్లో దాచుకోలేరు మరి#JaganPaniAyipoyindhi pic.twitter.com/zCi0lZWeBn
— Telugu Desam Party (@JaiTDP) June 28, 2022