ఏపీలో 5లక్షలు దాటిన కరోనా కేసులు

Advertisement

ఏపీలో కరోనా రోజురోజుకు ఉగ్రరూపం దాల్చుతుంది. ఇప్పటికే ప్రతిరోజు పది వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఇది ఇలా ఉంటె తాజాగా ఏపీ వైద్యారోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 8,368 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే గత 24గంటల్లో 70మంది మృతి చెందారు. దీనితో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 5,06,493కి చేరుకుంది. అలాగే ఇప్పటివరకు కరోనా కాటుకు మొత్తం 4487మంది మరణించారు.

జిల్లాల వారీగా కేసులు ;

అనంతపురంలో 584,
చిత్తూరులో 875,
ఈస్ట్‌ గోదావరిలో 1312,
గుంటూరులో 765,
కడపలో 447,
కృష్ణలో 193,
కర్నూలులో 316,
నెల్లూరులో 949,
ప్రకాశంలో 419,
శ్రీకాకుళంలో 559,
విశాఖపట్నంలో 405,
విజయనగరంలో 594,
పశ్చిమ గోదావరిలో 950 కేసులు నమోదయ్యాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here