ఏపీలో విజృంభిస్తున్న కరోనా
Admin - July 24, 2020 / 01:11 PM IST

ఏపీలో కరోనా మహమ్మారి శరవేగంగా విస్తరిస్తుంది. తాజాగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బుల్ టెన్ విడుదల చేసింది. రాష్ట్రంలో నేడు రికార్డు స్థాయిలో 8,147 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. అత్యధికంగా కేసులు నమోదు అవ్వడం ఇదే మొదటి సారి. దీనితో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా సోకిన వారి సంఖ్య 80,858కి చేరుకుంది. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 1029 కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్ తో ఈ ఒక్కరోజే 49 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనితో భయాందోళనలో ఉన్నారు ఏపీ ప్రజలు. ఒకవైపు కరోనా కట్టడి కోసం సర్కార్ చర్యలు తీసుకుంటున్న ఈ మహమ్మారి విజృంభణకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు.