ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం

Advertisement

కరోనా కట్టడికి ఏపీలో జగన్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కరోనా బాధితులకు మరో 54 ఆసుపత్రులను ఏర్పాటు చేయాలనీ నిర్ణయం తీసుకుంది. దీనితో మొత్తం 138 ఆసుపత్రుల్లో క్రిటికల్ కేర్ సదుపాయాలు కలిగిస్తున్నామని చెప్పారు. అలాగే రాష్ట్రంలో మరో ఐదు ఆసుపత్రుల్లో క్రిటికల్ కేర్ సదుపాయాలు కలిపించాలని నిర్ణయం తీసుకున్నామని, దాంట్లో మూడు ఆసుపత్రులు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయని అన్నారు. అలాగే కరోనా పేషంట్ల కోసం మరో 2380 పడకలు అందుబాటులోకి వస్తాయని తెలిపాడు. వచ్చే ఆరు నెలల్లో అదనంగా వెయ్యి కోట్ల నిధులు ఖర్చు పెడతామని అన్నారు. వీటిలో మెడిసిన్స్, ఇతర సదుపాయాలు మరియు ఆరోగ్య సిబ్బంది కోసం ఖర్చు పెడుతామని తెలియజేసారు. అంతేకాకుండా కరోనా టెస్టులు, క్వారంటైన్ సదుపాయాల కోసం రాష్టంలో 6.5 కోట్లు వరకు ఖర్చు పెడతామని ఈ మేరకు సీఎం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో తెలియజేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here