YS Jagan : అసెంబ్లీ రద్దు చెయ్యబోతోన్న వైఎస్ జగన్? ఈ మాట అన్నది ఎవరో కాదు?

YS Jagan : మీరు చదివిన టైటిల్ నిజమే? సీఎం జగన్ త్వరలో అసెంబ్లీనే రద్దు చేసేందుకు యోచిస్తున్నారట. దానికి కారణం ఏంటి? అసలు.. ఆయనకు అసెంబ్లీ రద్దు చేయాల్సిన అవసరం ఏంటి. 150కి పైగా వైసీపీ ఎమ్మెల్సీలు ఉన్నా.. ప్రభుత్వానికి ఎటువంటి డోకా లేదు. అయినప్పటికీ.. అసెంబ్లీని రద్దు చేయాలని ఎందుకు సీఎం జగన్ అనుకున్నారు.. అంటే.. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ఇప్పటికే విశాఖను సీఎం జగన్ ప్రకటించారు కదా. రాజధానిగా ప్రకటించిన తర్వాత విశాఖ మున్సిపల్ ఎన్నికల్లో ఒకవేళ వైసీపీ గెలవకపోతే ఎట్లా? అప్పుడు విశాఖ జనాలు.. రాజధానిని యాక్సెప్ట్ చేయనట్లే కదా. అందుకే.. విశాఖలో వైసీపీ గెలవకపోతే.. అసెంబ్లీని రద్దు చేస్తానని.. వైఎస్ జగన్.. మంత్రులతో చెప్పినట్టు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తన కొత్త పలుకులో చెప్పుకొచ్చారు.

వైజాగ్ లో ఖచ్చితంగా గెలవాల్సిందేనని.. అక్కడ గెలవకపోతే.. మంత్రులు తన ముఖం చూపించొద్దని.. జగన్ హెచ్చరించారట. అసెంబ్లీని కూడా రద్దు చేయడానికి వెనుకాడను.. అని మంత్రులకు వార్నింగ్ ఇచ్చారని.. తమకు వైసీపీ క్యాంపు నుంచి సోర్స్ అందిందంటూ రాధాకృష్ణ రాసుకొచ్చారు.

ఒకవేళ విశాఖలో ఓడిపోతే.. అసెంబ్లీని రద్దు చేయడం లేదా.. వైజాగ్ కు చెందిన మంత్రులను తీసేయడం ఏదో ఒకటి జరుగుతుందని.. ఆర్కే వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. అయితే.. విశాఖలో విజయసాయిరెడ్డి.. ఆయన అనుచరులు సృష్టిస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. జగన్ అలా ఉన్నారు కాబట్టే.. వాళ్లు అంతలా రెచ్చిపోతున్నారంటూ ఆర్కే కొత్త పలుకు చెబుతోంది.

అయితే.. ఇక్కడ ఆలోచించాల్సిన ఇంకో విషయం ఏంటంటే.. జగన్ నోటి నుంచి అటువంటి మాట రావాలని టీడీపీ నేతలు చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు. ఒకవేళ జగన్ అసెంబ్లీని రద్దు చేస్తే.. ప్లస్ పాయింట్ టీడీపీకే కదా. జగన్ ను అసెంబ్లీ రద్దు వైపు నడిపించడానికి టీడీపీ కూడా చాలానే కష్టపడింది. హైకోర్టులో చాలాసార్లు జగన్ కు ఎదురు దెబ్బలు తగిలాయి. అప్పుడు పాలనకు అడ్డు వస్తున్నారన్న సాకుతో.. జగన్.. మరోసారి ప్రజలకు నిర్ణయం అప్పగించాలని భావిస్తున్నారంటూ వార్తలు వచ్చాయి. గవర్నర్ వద్దకు జగన్ వెళ్లి.. అసెంబ్లీని రద్దు చేస్తారని అన్నారని.. టీడీపీ నేతలు ఆరోపించారు. కానీ.. జగన్.. బయటికి మాత్రం ఏనాడూ అసెంబ్లీని రద్దు చేస్తానని చెప్పలేదు. కానీ.. వైజాగ్ మున్సిపల్ ఎన్నికల విషయంలో మాత్రం వైసీపీ నేతలకు, మంత్రులకు జగన్ సీరియస్ వార్నింగే ఇచ్చి పడేశారట.

Advertisement
Advertisement