జగన్ మీద ఏమేం కామెంట్ లు చేశారో ఆ వీడియోలు అన్నీ తెప్పించుకుంటున్న జేసీ??
Ajay G - December 2, 2020 / 08:35 PM IST

వదల బొమ్మాళీ వదల.. అన్నట్టుగా ఉంది ప్రస్తుతం ఏపీ సీఎం జగన్ తీరు. ఎవ్వరినీ వదలడం లేదు. ఆరు నూరైనా.. నూరు ఆరైనా.. ఆయన టార్గెట్ లో ఉన్నవాళ్లపై నెమ్మదిగా ఫోకస్ చేస్తున్నారు. ప్రస్తుతం జగన్ టార్గెట్ మరెవరో కాదు జేసీ బ్రదర్స్.

ap cm ys jagan targets jc brothers
జేసీ బ్రదర్స్ అంటేనే జగన్ కు సుర్రుమంటుంది. వాళ్ల మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమంటుంది. అంత వైరం ఉంది వాళ్ల మధ్య. వైఎస్ఆర్ బతికి ఉన్నప్పటి నుంచి వాళ్ల మధ్య గొడవలే. అవి నిజానికి కుటుంబ గొడవలు. జేసీ బ్రదర్స్ ది అనంతపురం అయినా.. వైఎస్ రాజశేఖర్ రెడ్డిది కడప జిల్లా అయినా కూడా.. పులివెందుల, తాడిపత్రి ప్రాంతాలు దగ్గర దగ్గరగా ఉండటం వల్ల ఈ రెండు కుటుంబాల మధ్య ఎప్పటి నుంచో ఫ్యాక్షన్ గొడవలు ఉన్నాయి. అవి అలాగే ఇప్పటికీ కొనసాగుతున్నాయి.
కట్ చేస్తే రాష్ట్రం రెండుగా విడిపోయింది.. అప్పటికీ కొన్నేళ్ల పాటు జేసీ బ్రదర్స్ కాంగ్రెస్ లోనే ఉన్నా.. తర్వాత టీడీపీలోకి జంప్ అయ్యారు. జేసీ బ్రదర్స్ టీడీపీలోకి రావడం చాలామంది టీడీపీ నాయకులకు నచ్చలేదు అయినా సరే.. జేసీ బ్రదర్స్ ను మాత్రం చంద్రబాబు అక్కున చేర్చుకున్నారు.
2014లో టీడీపీ ఏపీలో విజయదుందుబి మోగించింది. దీంతో జేసీ బ్రదర్స్ ఆగలేదు. రెచ్చిపోయారు. అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఆయనపై చాలానే విమర్శలు చేశారు. అయితే.. జగన్ మాత్రం అప్పుడు వాళ్లను ఏం అనలేదు. ఎందుకంటే.. తనకూ టైమ్ వస్తుందిలే అని అనుకున్నారు. వాళ్ల మాటలను మనసులో పెట్టుకున్నారు.
ఇప్పుడు ఆ టైమ్ నిజంగానే వచ్చింది. అయితే.. జగన్ ప్రభుత్వం రాగానే.. జేసీ బ్రదర్స్ రూట్ మార్చారు. జగన్ మావోడేలే అంటూ వైసీపీలో చేరేందుకు ప్రయత్నాలు చేశారు కానీ.. అవి బెడిసికొట్టాయి. ఇక.. జగన్ తన ఆటను స్టార్ట్ చేశారు. జేసీ బ్రదర్స్ కు చుక్కలు చూపిస్తున్నారు.
ఇటీవలే జేసీపై ఏపీ మైనింగ్ అధికారులు 100 కోట్ల జరిమానా విధించిన విషయం తెలిసిందే. త్రిశూల్ సిమెంట్ ఫ్యాక్టరీ అక్రమాల గుట్టు రట్టయింది. మైనింగ్ లీసులు, దివాకర్ ట్రావెల్స్ బస్సులు.. ఇలా.. జేసీ బ్రదర్స్ కు చెందిన అన్ని కంపెనీలపై జగన్ కన్ను పడింది. వామ్మో.. జేసీపై ఇంతలా జగన్ విరుచుకుపడుతున్నారేంటి.. ఆయన కళ్లలో పడితే అంతేనా ఇక.. అంటూ ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో పెద్ద చర్చ నడుస్తోంది.