వైఎస్సాఆర్ సమాధి వద్ద సీఎం జగన్ నివాళులు

Advertisement

దివంగత మాజీ ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖర్ రెడ్డి వర్థంతి సందర్భంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరియు తన కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు. అయితే నేడు రాజశేఖర్ రెడ్డి 11వ వర్ధంతి ని పురస్కరించుకొని ఇడుపులపాయ లోని వైస్సార్ సమాధి వద్ద పుష్పగుచ్చాలు అలంకరించి ఘనంగా నివాళులు అర్పించారు. ఇక ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి, వైఎస్‌ విజయమ్మ, వైఎస్‌ భారతి ఇతర కుటుంబసభ్యులు పాల్గొన్నారు. తరువాత అక్కడ నిర్వహించిన ప్రార్థనల్లో జగన్ పాల్గొని ప్రార్థనలు చేసారు. సీఎం జగన్ ‌తో పాటు వారి కుటుంబసభ్యులు, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, వైసీపీ నేతలు, అభిమానులు వైఎస్సార్ ‌కు ఘనంగా నివాళులు అర్పించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here