మిస్ ఫైర్ అయిన జగన్ ఐడియా – కొంప మునిగేలా ఉంది..!

మూడు రాజధానుల బిల్లుపై ఏపీ శాసన మండలిలో పెద్ద రచ్చే జరిగింది. సీఆర్డీయే రద్దు బిల్లు విషయంలోనూ అంతే. అందుకే కదా… ఏపీ సీఎం వైఎస్ జగన్ శాసనమండలిని రద్దు చేశారు. ఆ తర్వాత వెంటనే కరోనా రావడం.. జనాలు కూడా శాసనమండలి గురించే ఆలోచించడం మరిచిపోయారు. కేంద్రం కూడా ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. అప్పుడే కాదు.. ఇప్పుడు కూడా కేంద్రం ఆ విషయంపై పెద్దగా స్పందించడం లేదట.

ap cm ys jagan idea went wrong
ap cm ys jagan idea went wrong

అలా ఎలా శాసనమండలిని రద్దు చేస్తారు.. అని కేంద్రం అప్పట్లోనే సీరియస్ అయింది ఏపీ ప్రభుత్వం మీద అనే వార్తలు వచ్చినప్పటికీ.. వాటిలో వాస్తవం ఎంత అనేది డౌటే. కేంద్రం సీరియస్ అంటే జగన్ వెనకడుగు వేయాల్సిందే అని అంతా అనుకున్నారు. కానీ.. అదేమీ జరగలేదు.

కట్ చేస్తే కొన్ని రోజుల్లో ఏపీ అసెంబ్లీ సమావేశాలు మొదలుకానున్నాయి. ఈ నేపథ్యంలో శాసనమండలి రద్దు విషయంపై మరోసారి ఆలోచనలో పడ్డారట సీఎం జగన్.

ఎందుకంటే.. ఎవరికైనా ఎమ్మెల్సీ పదవి ఇస్తే ఎక్కడ కూర్చోబెడతారు. మండలి లేకపోతే ఎలా? తిరుపతి ఉపఎన్నిక అభ్యర్థిగా గురుమూర్తిని జగన్ ప్రకటించారు. బల్లి దుర్గాప్రసాద్ కొడుకుకేమో ఎమ్మెల్సీ ఇస్తా అని మాటిచ్చారు. తీరా చూస్తే ఇక్కడ శాసన మండలే లేదాయె? ఎలా.. అందుకే.. ఎలాగైనా శాసనమండలిని కొనసాగించాల్సిందే.. అని జగన్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

దుర్గా ప్రసాద్ కొడుకుకే కాదు.. చాలామంది అసంతృప్తితో ఉన్నవాళ్లకు జగన్ ఎమ్మెల్సీ ఆఫర్ ఇచ్చి అలా వెయిటింగ్ లిస్టులో పెట్టారు. అటువంటప్పుడు మండలిని కొనసాగించాల్సిందే కదా. అయితే.. అప్పుడు రద్దు చేస్తున్నానంటూ ప్రకటించి.. ఇప్పుడేమో మళ్లీ జగన్ కొనసాగిస్తానని చెప్పడం ఏంటి అంటూ ప్రతిపక్షాల నుంచి విమర్శలు రావడం కామన్. ఏది ఏమైనా మండలి ఉంటే.. తమకు పదవులు వస్తాయి కదా అని చెప్పి వైసీపీ నేతలు మాత్రం కాలర్ ఎగరేస్తున్నారట. చూద్దాం మరి ఒకవేళ మండలిని రద్దు చేయకపోతే మూడు రాజధానుల బిల్లు ఆమోదం విషయం ఎటు మళ్లుతుందో?

Advertisement