ఆంధ్ర ప్రదేశ్ లో క్లైమాక్స్ ఫైట్ – డిల్లీ వరకూ వెళ్లబోతోన్న పంచాయతీ
Ajay G - January 9, 2021 / 08:08 PM IST

ఏంటో అసలు.. స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయా? జరగవా? ఇలాంటి వార్ ను ఏపీ ప్రజలు ఏనాడూ చూసి ఉండరు. ఏపీ ప్రభుత్వం, ఈసీ మధ్య జరుగుతున్న వార్ మామూలుగా లేదు. ఏపీ సీఎస్.. నిమ్మగడ్డను కలిసి.. ఇప్పుడే ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధంగా లేదని చెప్పిన వెంటనే.. నిమ్మగడ్డ షెడ్యూల్ ప్రకటించడం ఏంటో? ఆ వెంటనే.. ప్రభుత్వం ఈ ఎన్నికలను బహిష్కరిస్తోందంటూ సీఎస్ చెప్పడం ఏంటో? అంతా గందరగోళంగా ఉంది.

ap cm ys jagan and nimmagadda war begins
కరోనా కారణం చెప్పి ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయిస్తూనే ఉన్నది. నిమ్మగడ్డ మార్చిలో రిటైర్ అవనున్నారు. ఆయన రిటైర్ అయ్యేవరకు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేది లేదని ప్రభుత్వం ఫిక్సయిపోయింది. కానీ.. తాను రిటైర్ అయ్యేలోపు ఎన్నికలు నిర్వహించాలని నిమ్మగడ్డ ఫిక్స్ అయ్యారు. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల విషయం చిన్నపిల్లల ఆటలా మారింది.
మరి.. ఈ పంచాయతీ ఎన్నికల పంచాయితీ ఢిల్లీ దాకా పోతుందా? లేక సీఎం జగన్ తదుపరి స్టెప్ ఏం తీసుకుంటారు? అనేది ప్రస్తుతం సస్పెన్స్ గా ఉంది. హైకోర్టు కాకపోతే.. సుప్రీంకు వెళ్లి అయినా సరే… స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయించాలని ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందట. చూద్దాం మరి.. భవిష్యత్తులో స్థానిక సంస్థల ఎన్నికల ఇష్యూ ఎన్ని మలుపులు తిరుగుతుందో?