CM Jagan: బ్యాంకులకు ఏపీ సీఎం వైఎస్ జగన్ వార్నింగ్

CM Jagan ‘జగనన్న విద్యా దీవెన’ పథకంలో భాగంగా లబ్ధిదారులకు వాళ్ల ఖాతాల్లో వేసిన డబ్బులను బ్యాంకులు పాత అప్పుల కింద జమచేసుకోవటంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీరియస్ అయ్యారు. ‘‘రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తూ విడుదల చేస్తున్న వివిధ స్కీమ్ లకి సంబంధించిన అమౌంట్ ని లబ్ధిదారుల అకౌంట్ల నుంచి ఇతరత్రా కారణాలతో ట్రాన్స్ ఫర్ చేసుకోవద్దని గతంలో చెప్పాం. ఈ మేరకు స్టేట్ లెవల్ బ్యాంకర్స్ కమిటీ (ఎస్ఎల్బీసీ) మీటింగులో నిర్ణయం తీసుకున్నాం. దాన్ని అన్ని బ్యాంకులు తప్పనిసరిగా అమలుచేయాలి’’ అని సీఎం తేల్చిచెప్పారు.

cm jagan ap
cm jagan ap

నెల్లూరు జిల్లాలో..

నెల్లూరు జిల్లాలో 74 మంది ‘జగనన్న విద్యా దీవెన’ లబ్ధిదారులకు ప్రభుత్వం ఇచ్చిన సాయాన్ని విత్ డ్రా చేసుకునే అవకాశం లేకుండా ఒక బ్యాంకు హోల్డ్ లో పెట్టడంపై వివాదం తలెత్తింది. ఈ విషయం ముఖ్యమంత్రి కార్యాలయం దృష్టికి వెళ్లింది. దీంతో దీనిపై సమగ్రంగా విచారణ జరపాలని జగన్ ఆదేశించారు. సంక్షేమ పథకాలకు సంబంధించి సర్కారు ఇచ్చే నగదును ఇతర లోన్ల బకాయిల కింద జమ చేసుకోకుండా పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. భవిష్యత్తులో ఎవరైనా ఇలాంటి వ్యవహారాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలని బ్యాంకర్లను కోరారు. ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేయటంతో ఈ సమస్యని నిన్న రాత్రి లోపే పరిష్కరించినట్లు ప్రభుత్వం పేర్కొంది.

ఇవాళ ‘సున్నా వడ్డీ’ డబ్బు..

సోమవారం ‘జగనన్న విద్యా దీవెన’ నిధులను విడుదల చేసిన ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ శుక్రవారం ‘సున్నా వడ్డీ’ పథకానికి సంబంధించిన నిధులను లబ్ధిదారుల ఖాతాల్లో వేశారు. 1.02 కోట్ల మందికి పైగా పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలపై ప్రతి నెలా వడ్డీని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. ఇలా చేయటం ఇది వరుసగా రెండో ఏడాది. ఈ ఏడాది వడ్డీ మొత్తం రూ.1,109 కోట్లు. ఈ నిధుల విడుదల సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రుణాల పేరుతో మహిళలను మోసిందని విమర్శించారు. తాము మాత్రం మహిళా సాధికారతే నినాదంగా విధానంగా ముందుకుపోతున్నామని చెప్పారు.

Advertisement