AP CID : రామోజీ రావు, శైలజా కిరణ్ లకు సీఐడీ నోటీసులు
NQ Staff - June 22, 2023 / 09:36 PM IST

AP CID : మార్గదర్శి చిట్ ఫండ్స్ ఆర్థిక అక్రమాల కేసులో నిందితులుగా ఉన్న ఏ1 రామోజీ రావు మరియు ఏ2 శైలజా కిరణ్ లకు ఏపీ సీఐడీ నోటీసులు ఇవ్వడం జరిగింది. గుంటూరులోని సీఐడీ రీజనల్ ఆఫీస్ కి వచ్చి హాజరు అవ్వాలి అంటూ సీఐడీ అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు.
41ఏ కింద వారికి నోటీసులు ఇవ్వడం జరిగింది అంటూ సీఐడీ అధికారులు తెలియజేశారు. ఈ నెల మొదటి వారంలో శైలజా కిరణ్ ను ఈ కేసులో విచారించేందుకు ఆమె ఇంటికి వెళ్లగా సీఐడీ కి చెందిన పది మందిని అనుమతించలేదు. దాంతో సీఐడీ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
విచారణ సమయంలో శైలజ కిరణ్ పదే పదే ఆటంకాలు కల్పించడంతో తాము అడగాల్సిన ప్రశ్నల్లో కనీసం 25 శాతం ప్రశ్నలు కూడా అడగలేక పోయాం అంటూ సీఐడీ అధికారులు పేర్కొన్నారు. అందుకే మరోసారి ఆమెను విచారించాలని భావిస్తున్నట్లుగా అధికారులు తెలియజేశారు. అంతే కాకుండా రామోజీరావును కూడా విచారించేందుకు సిద్ధం అవుతున్నట్లుగా వారు తెలియజేశారు.