OTT లో అనుష్క నిశ్శబ్దం మూవీ, డేట్ ఫిక్స్

Advertisement

కరోనా కారణంగా థియేటర్స్ ఇంకా ఓపెన్ కాలేదు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న మూవీస్ ఓటిటి రిలీజ్ కు మొగ్గు చూపుతున్నాయి. ఇప్పటికే తెలుగులో కృష్ణ అండ్ హిజ్ లీల, ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య V లాంటి మూవీస్ ఓటిటిలో రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు అనుష్క నటించిన నిశ్శబ్దం మూవీ కూడా అక్టోబర్ 2న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కానుంది.

30కోట్లు పెట్టి నిర్మించిన ఈ చిత్రాన్ని అమెజాన్ 20కోట్లకు కొనుగోలు చేసిందని సమాచారం. ఈ మూవీని హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో అనుష్క, మాధవన్, అంజలి, అవసరాల శ్రీనివాస్ మొదలగువారు నటించారు. ఈ మూవీ వచ్చే నెల 2న తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళంలో రిలీజ్ కానుంది. ఇదే రోజున రాజ్ తరుణ్ నటించిన ఒరేయ్ బుజ్జిగా కూడా ఆహా ప్లాట్ఫామ్ లో రిలీజ్ కానుంది.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here