Anushka Shetty : ఆరో తరగతిలోనే అతనితో లవ్ లో పడ్డా.. అనుష్క శెట్టి మామూల్ది కాదురోయ్..!
NQ Staff - June 8, 2023 / 10:37 AM IST

Anushka Shetty : అభిమానులు అందరూ ముద్దుగా స్వీటీ అని పిలుచుకుంటారు. కానీ వెండితెరపై మాత్రం ఆమెను దేవసేన, జేజమ్మ అని పిలచుకుంటారు. ఎలాంటి పవర్ ఫుల్ రోల్ చేయాలన్నా సరే అది కేవలం అనుష్కకు మాత్రమే సాధ్యం. అందుకే ఆమెకు హీరోలతో సమానంగా ఫ్యాన్స్ ఉన్నారు. అయితే అనుష్కపై ఇప్పటి వరకు పెద్దగా లవ్ ఎఫైర్ రూమర్లు రాలేదు.
కేవలం ప్రభాస్ తో మాత్రమే లవ్ లో ఉందంటూ వార్తలు వచ్చాయి. కానీ తామిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అంటూ ఇద్దరూ చెప్పుకున్నారు. దాంతో ఈ వార్తలపై క్లారిటీ వచ్చేసింది. అయితే అనుష్క శెట్టి గురించి ఎవరికీ తెలియని విషయం ఒకటి ఇప్పుడు తెరమీదకు వచ్చింది. గతంలో అనుష్క శెట్టిని జయప్రద ఇంటర్వ్యూ చేసిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది.
ఆ ఇంటర్వ్యూలో అనుష్క శెట్టి తన మొదటి లవ్ స్టోరీ గురించి చెప్పింది. నేను ఆరో తరగతిలో ఉన్నప్పుడే నాకు ఓ కుర్రాడు లవ్ ప్రపోజ్ చేశాడు. అప్పుడు ప్రేమనో, అట్రాక్షనో నాకు తెలియదు. కానీ చెప్పగానే ఓకే చేసేశాను. ఆ తర్వాత అతనికి దూరంగా వెళ్లిపోయాను. కానీ ఇప్పటికీ నాకు అది ఒక మెమొరియల్ గా నిలిచిపోయింది.
ఆ తర్వాత నాకు ఎలాంటి లవ్ స్టోరీలు లేవు. చాలా ప్రపోజల్స్ వచ్చాయి కానీ యాక్సెప్ట్ చేయలేదు. కాగా అనుష్క శెట్టి చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఆమె రెండు సినిమాలతో బిజీగా ఉంది. త్వరలోనే ఈ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఇక అనుష్క వయసు పెరుగుతున్నా సరే ఇంకా సింగిల్ గానే ఉంది.