Anushka Shetty Gave Shocking News Fans : సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్న అనుష్క.. అదే చివరి సినిమా అంట..!
NQ Staff - July 29, 2023 / 10:47 AM IST

Anushka Shetty Gave Shocking News Fans :
స్వీటీ అంటే అందరికీ టక్కున టాలీవుడ్ లో అనుష్క మాత్రమే గుర్తుకు వస్తుంది. ఆ రేంజ్ లో ఆమె ఫాలోయింగ్ సంపాదించుకుంది. కేవలం తెలుగులోనే కాకుండా అటు తమిళంలో కూడా ఎన్నో సినిమాల్లో నటించింది. దాదాపు అందరు స్టార్ హీరోలతో నటించి మెప్పించింది ఈ కన్నడ బ్యూటీ.
అనుష్క అంత పెద్ద స్టార్ హీరోయిన్ అయినా సరే ఆమె మాత్రం ఎన్నడూ గర్వం చూపించలేదు. కేవలం తాను ఒక నటిని అని మాత్రమే చెప్పుకుంది. అలాంటి అనుష్క ఇప్పుడు ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్ చెప్పింది. అదేంటంటే ఆమె త్వరలోనే సినిమాలకు గుడ్ బై చెప్పబోతుందంట.
ఛాన్సులు రావట్లేదా..?
ప్రస్తుతం ఆమె మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాలో నటిస్తోంది. ఇదే ఆమె చివరి సినిమా అని తెలుస్తోంది. దీని తర్వాత ఆమె ఒక్క సినిమాకు కూడా సైన్ చేయలేదు. ఎందుకంటే ఆమెకు హీరోల సరసన పెద్దగా ఛాన్సులు రావట్లేదు. ఇక లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేయొద్దని ఆమె డిసైడ్ అయిందంట.
ఇక ఎలాగూ తన వయసు కూడా నాలుగు పదులు దాటిపోతోంది. అందుకే రెస్ట్ తీసుకోవాలని భావిస్తోందంట. కొందరేమో పెళ్లి చేసుకుంటుందని చెబుతున్నారు. కానీ ఒక రకంగా ఆమె పెళ్లి వయసు దాటిపోయిందనే చెప్పుకోవాలి. తనకు పెళ్లి మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేదని ఆమె గతంలోనే చెప్పింది. మరి ఆమె సినిమాలకు నిజంగానే దూరం అవుతుందా లేదా అనేది చూడాలి.