Samantha : బాలయ్య అన్‌స్టాపబుల్ కోసం అనుష్క, సమంత.!

NQ Staff - September 26, 2022 / 10:26 PM IST

Samantha : బాలయ్య అన్‌స్టాపబుల్ కోసం అనుష్క, సమంత.!

Samantha : నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా మారి, ‘ఆహా’లో సందడి చేసిన విషయం విదితమే. సీజన్ వన్ సూపర్ హిట్ అయ్యింది. సూపర్ స్టార్ మహేష్‌బాబు సహా పలువురు ప్రముఖులు బాలయ్యతో టాక్ షో సందర్భంగా హల్‌చల్ చేసేశారు.
మరి, సీజణ్ టూ సంగతేంటి.? అది కూడా అతి త్వరలో షురూ కాబోతోంది. ఈ సారి ఇంకాస్త ఫన్, ఇంకాస్త ఎనర్జీతో అన్ స్టాపబుల్ సీజన్ టూ రాబోతోందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా.! అందుకే, అభిమానుల అంచనాలకు తగ్గట్టుగానే రెండో సీజన్‌ని డిజైన్ చేస్తున్నారట.

అనుష్క, సమంత.. ఇంకా ఎవరు.?

ప్రస్తుతానికైతే సీజన్ టూ కోసం హీరోయిన్ సమంతతో సంప్రదింపులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ టాక్ షో ద్వారా సమంత తన వ్యక్తిగత జీవితం గురించి పూర్తిగా బాలయ్య ముందు ఓపెన్ అయిపోవడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది.
మరోపక్క, జేజెమ్మ అనుష్క కూడా ఈ సీజన్‌లో సందడి చేయబోతోందట. అనుష్కతోనూ ‘ఆహా అన్ స్టాపబుల్’ టీమ్ సంప్రదింపులు జరుపుతోందట. అనుష్కతో బాలయ్య టాక్ షో అంటే.. ఖచ్చితంగా అనుష్క పెళ్ళి గురించిన ప్రస్తావన వచ్చి తీరుతుంది.
అన్నట్లు బాలకృష్ణ – అనుష్క కలిసి ఓ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us