కంగన నువ్వుండగా దేశాన్నిఎవరు టచ్‌ చేయలేరు : దర్శకుడు అనురాగ్‌

Advertisement

బాలీవుడ్ లో ప్రస్తుతం డ్రగ్స్ విషయం కలకలం రేపుతోంది. బాలీవుడ్ లో పలువురు నటులు డ్రగ్స్ తీసుకున్నారు అని కంగనా చెప్పిన మాటలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇక ప్రస్తుతం కంగన రనౌత్ సోషల్‌మీడియాలో ఎప్పటికప్పుడు తన అభిప్రాయాలను వెల్లడిస్తూ వివాదాలను తెచ్చిపెట్టుకుంటుంది. మహారాష్ట్ర సర్కార్, బీటౌన్ ‌పై ఆమె ఇటీవల చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఇక ఈ నేపథ్యంలో పలువురు సెలబ్రిటీలు సైతం కంగనపై తీవ్రంగా ఫైర్ అయ్యారు.

ఈ నేపథ్యంలో తాజాగా ఆమె పెట్టిన ఓ ట్వీట్‌ పై దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ వ్యంగ్యంగా స్పందింస్తూ.. ‘నేను ఒక పోరాట మహిళను. ప్రాణత్యాగం అయిన చేస్తా.. కానీ వేరొకరికి తలవంచను. దేశ గౌరవం కాపాడేందుకు ఎప్పటికి నా నా గొంతును వినిపిస్తా.. మర్యాద, ఆత్మగౌరవంతో ఒక జాతీయవాదిగా జీవనం సాగిస్తున్న. ఎలాంటి పరిస్థితుల్లోనూ విలువల విషయంలో రాజీపడను.. జైహింద్‌’ అని కంగన పెట్టిన ట్వీట్ ‌పై అనురాగ్‌ వ్యంగ్యంగా స్పందించారు. కంగనా మీరు చైనా మీద పోరాటం చేయండి. బహుష్య మీరు ఉన్నారనే చైనా వారు భయపడుతున్నారు అనుకుంట అని అనురాగ్ ఎద్దేవా చేసాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here