vijay devarakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ గెట‌ప్‌లో ఉన్న ఈ లేడీ భామ ఎవ‌రో తెలుసా?

అర్జున్ రెడ్డి సినిమాతో అంద‌రి దృష్టి ఆక‌ర్షించిన రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ఈయ‌న న‌ట‌న క‌న్నా కూడా స్టైల్‌, ఆటిట్యూడ్, బాడీ లాంగ్వేజ్ అభిమానుల‌కు తెగ న‌చ్చేస్తుంటుంది. అతి త‌క్కువ స‌మ‌యంలో మంచి క్రేజ్ తెచ్చుకున్న విజ‌య్ దేవ‌ర‌కొండ చివ‌రిగా వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్ అనే చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. ఈ మూవీ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బోల్తా కొట్ట‌డంతో ప్ర‌స్తుతం పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో లైగ‌ర్ అనే మూవీ చేస్తున్నాడు. కొద్ది రోజుల క్రితం మూవీ టైటిల్ పోస్ట‌ర్ విడుద‌ల చేయగా, దీనికి భారీ రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ పోస్ట‌ర్‌కు అభిమానులు పాలాభిషేకాలు, బీరాభిషేకాలు చేసి ర‌చ్చ చేశారు. పెద్ద హీరో సినిమాల ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్స్‌కు కూడా ఈ రేంజ్‌లో హ‌డావిడి జ‌ర‌గ‌దు. అలాంటి విజ‌య్‌కు ఆ గుర్తింపు ద‌క్క‌డం విశేషం.

అల్లు అర్జున్ త‌ర్వాత టాలీవుడ్ స్టైలిష్ ఐకాన్‌గా మారాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. అత‌ని డ్రెస్సింగ్ స్టైల్ అమ్మాయిల‌కే కాదు, అబ్బాయిల‌కు కూడా తెగ న‌చ్చేస్తుంటుంది. అందుకే రౌడీ బ్రౌండ్ పేరుతో ప‌లు దుస్తుల‌ను మార్కెట్‌లోకి తీసుకొస్తున్నాడు. వాటిని ధ‌రించిన అభిమానులు విజ‌య్ దేవ‌ర‌కొండ మాదిరి ఫోజులు కొడుతున్నారు. అయితే సామాన్యులే కాదు సెల‌బ్స్ కూడా విజ‌య్ దేవ‌ర‌కొండ స్టైల్‌ని ఫాలోఅవుతుండ‌డం విశేషం. తాజాగా మ‌ల‌యాళీ బ్యూటీ అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ .. విజ‌య్ మాదిరిగా రెడీ అయి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. క‌ళ్ల‌ద్దాలు పెట్టుకొని క‌ర్లీ హెయిర్‌తో అచ్చం విజ‌య్ డూప్‌లా క‌నిపించింది. ఈ ఫొటోను చూసిన వారంద‌రు ఈమె అనుప‌మ ప‌ర‌మేశ్వర‌న్ అంటే ఏ మాత్రం న‌మ్మ‌లేకుండా ఉన్నారు.

కేర‌ళ కుట్టీ అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌కు ప్ర‌స్తుతం తెలుగులో ఆఫ‌ర్స్ క‌రువ‌య్యాయి.దీంతో వెబ్ సిరీస్‌, యూట్యూబ్‌లో షార్ట్ ఫిలింస్‌, అడ‌పాద‌డపా సోష‌ల్ మీడియాలో ఇలాంటి ఫొటోస్‌తో హ‌ల్ చల్ చేస్తుంది. అనుప‌మ చేసిన ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్ అనే షార్ట్ ఫిలిం కొద్ది రోజుల క్రితం విడుద‌ల కాగా, దీనికి మంచి పేరు వ‌చ్చింది. మంచి ఆఫ‌ర్స్ కోసం ఎదురు చూస్తున్న అనుప‌మ విజ‌య్ దేవ‌ర‌కొండ లేడీ వ‌ర్షెన్‌లా మారి హాట్‌టాపిక్‌గా నిలిచింది. ఈ అమ్మ‌డి ఫొటో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాను షేక్ చేస్తుండ‌గా, దీనిపై విజ‌య్ దేవ‌ర‌కొండ ఏమైన స్పందిస్తాడా అని ఫ్యాన్స్ అంతా ఆస‌క్తిగా గ‌మ‌నిస్తున్నారు.

Advertisement