Anupama Parameswaran : అవును.. నేను హీరోయిన్ గా పనికి రాను.. అనుపమ షాకింగ్ ఆన్సర్..!
NQ Staff - June 12, 2023 / 10:35 AM IST

Anupama Parameswaran : మలయాళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ గురించి అందరికీ తెలిసిందే. ఆమెకు యూత్ లో ఎంత మంచి ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలిసిందే. ఆమె చాలా కాలంగా సినిమాలు చేస్తున్నా సరే ఎందుకో స్టార్ స్టేటస్ మాత్రం దక్కలేదు. తెలుగులో ఆమె చాలానే హిట్ మూవీలు చేసింది. రీసెంట్ గానే కార్తికేయ-2 సినిమాతో చాలా పెద్ద హిట్ అందుకుంది.
ఇక ప్రస్తుతం డీజేటిల్లు మూవీ సీక్వెల్ అయిన టిల్లు స్కేర్ లో నటిస్తోంది. ఇందులో ఆమె మొదటిసారి బోల్డ్ గా నటిస్తున్నట్టు తెలుస్తోంది. లాప్ లాక్ లతో రెచ్చిపోయిందని ఇప్పటికే విడుదలైన ఫొటోలు తెలియజేస్తున్నాయి. ఇదిలా ఉండగా ఆమె అప్పుడప్పుడు తన ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా.
తాజాగా ఆమె చిట్ చాట్ చేయగా.. ఓ నెటిజన్ ఆసక్తికర ప్రశ్న వేశాడు. నీకు ఇప్పటి వరకు పెద్ద హీరోల సినిమాల్లో ఛాన్సులు రాలేదు. అసలు నువ్వు హీరోయిన్ వే కాదు అంటూ అన్నాడు. దానికి షాకింగ్ ఆన్సర్ ఇచ్చింది అనుపమ. అవును అన్నా.. నువ్వు అన్నట్టే నేను హీరోయిన్ కాదు.
కేవలం యాక్టర్ ను మాత్రమే అంటూ ఇచ్చి పడేసింది. దాంతో ఈ రిప్లై కాస్తా నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. అంటే అనుపమ పరమేశ్వరన్ ఉద్దేశం ప్రకారం.. హీరోయిన్ అయితే కేవలం గ్లామర్ పరంగానే ఉంటానని.. నటిగా ఉండాలనుకుంటున్నాను కాబట్టే విభిన్నమైన పాత్రల్లో నటిస్తున్నట్టు ఇన్ డైరెక్టుగా చెప్పేసిందన్నమాట.