కరోనాను ఖచ్చితంగా నిర్ధారణ చేయలేకపోతున్న యాంటీ జెన్ పరీక్షలు

Advertisement

కరోనాను నిర్దారించడానికి మొదటగా యాంటీ జెన్ పరీక్షలు నిర్వహిస్తారు. ఈ పరీక్షల్లో పాజిటివ్ వస్తే తదుపరి చికిత్స కోసం ఆసుపత్రులకు పంపిస్తున్నారు. ఒకవేళ నెగటివ్ వస్తే మాత్రం వారిని ఇంటికి పంపిస్తున్నారు. అయితే ఈ యాంటీ జెన్ పరీక్షల వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురు అవుతున్నాయని, ఈ పరీక్షల్లో నెగటివ్ వచ్చిన వారిలో చాలా మందికి కరోనా ఉందని, ఈ టెస్టులు సరైన ఫలితాలు ఇవ్వడం లేదని అధికారులు వెల్లడిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ లోని ఎల్బీ నగర్ కు ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో యాంటీ జెన్ టెస్టులు చేయించుకోగా నెగటివ్ వచ్చింది. దీంతో ఇంటికి వెళ్లిపోయారు. మూడు రోజుల తరువాత కరోనా లక్షణాలు ప్రభావం పెరగడంతో ఈ సారి ఆర్టీ పీసీఆర్ టెస్టులు చేయించుకోగా కరోనా పాజిటివ్ వచ్చింది. ఇలా చాలా కేసుల్లో జరుగుతుందని వైద్యులు తెలుపుతున్నారు.

యాంటీ జెన్ టెస్టుల్లో పాజిటివ్ వస్తే పర్వాలేదని, ఒక నెగటివ్ వస్తే మాత్రం ఆర్టీ పీసీఆర్ టెస్టులు ఖచ్చితంగా చేయించుకోవాలని, ఇది కాకపోతే ఛాతీ ఎక్స్‌రే, లేదంటే సీటీ స్కాన్‌ చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. యాంటీ జెన్టెస్టు యొక్క ఫలితాలు కేవలం అర్ధగంటలో వస్తాయి, ఆర్టీ పీసీఆర్ యొక్క ఫలితాలు మూడు రోజుల్లో వస్తాయి. దీంతో ప్రజలు యాంటీ జెన్ టెస్టులు చేయించుకోవడానికే ఆసక్తి కనపరుస్తున్నారని అధికారులు తెలుపుతున్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here