Antarvedi Sea : రెండు కిలోమీట‌ర్లు లోనికి వెళ్లిన స‌ముద్రం.. ఆశ్చ‌ర్య‌పోతున్న స్థానికులు

Antarvedi Sea : ఒక్కోసారి స‌ముద్రం విచిత్రంగా వ్య‌వ‌హ‌రిస్తుండ‌డం మ‌నం చూస్తూనే ఉంటాం. కొన్ని అడుగుల ముందుకు రావ‌డం లేదంటే వెన‌క్కి వెళ్ల‌డం జ‌రుగుతూ ఉంటుంది. అయితే అంత‌ర్వేది స‌ముద్రం ఇప్పుడు రెండు అడుగులు వెన‌క్కి వెళ్లింద‌ట‌. ఇది ప్ర‌తి ఒక్కరిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది.

TheNewsQube-


Antarvedi Sea Went 2 Kms Backwards
Antarvedi Sea Went 2 Kms Backwards


బంగాళాఖాతంలో గోదావరి నది కలిసే సంగమ ప్రదేశం.. అంతర్వేది. తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలంలో ఉన్న అంతర్వేదిలో లక్ష్మీ నరసింహ స్వామి కొలువై ఉన్నాడు. అక్క‌డికి నిత్యం కొన్ని వంద‌ల మంది యాత్రికులు వ‌స్తుంటారు. అయితే ఇప్పుడు అంత‌ర్వేది స‌ముద్రం ద‌గ్గ‌ర విచిత్ర ప‌రిస్థితులు నెల‌కొన‌డం స్థానికుల‌ని భ‌య‌పెట్టిస్తుంది. గత కొద్ది రోజులుగా అంతర్వేది వద్ద సముద్రం ముందుకు చొచ్చుకొస్తోంది. ఉవ్వెత్తున ఎగసిపడుతున్న అలలు ప్రజలను భయపెడుతున్నాయి.

పోటెత్తుతున్నఅల‌ల‌తో స‌ముద్రం ముందుకు రాగా, మ‌ళ్లీ ఉన్న‌ట్టుండి రెండు కిలోమీటర్ల మేర వెనక్కి వెళ్లిపోయింది. కొన్ని చోట్ల ముందుకు, మరికొన్నిచోట్ల వెనక్కు.. అది కూడా కూతవేటు దూరంలోనే కిలోమీటర్ల మేర భిన్నమైన మార్పులు వస్తుండడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు స్థానికులు. గ‌తంలో అమావాస్య‌, పౌర్ణ‌మికి మాత్ర‌మే సాగ‌రుడు ముందుకు వ‌చ్చేవాడు.

గ‌త నెల రోజులుగా ప‌రిస్థితులు భిన్నంగా ఉన్నాయి. 45 మీట‌ర్ల మేర స‌ముంద్రం ముందుకు చొచ్చుకొచ్చింది. సముద్రం ముందుకు రావడంతో.. తీరమంతా మునిగిపోయి.. నీరే కనిపిస్తోంది. ఫలితంగా సముద్రం ఒడ్డున నిర్మించిన షాపులు కూలిపోయాయి. వారం రోజుల క్రితం సముద్రం 25 మీటర్ల మేర ముందుకొచ్చింది. ఇప్పటి వరకు సముద్రం 45 మీటర్ల మేరకు ముందుకు వచ్చింది.

అల‌ల తాకిడికి స‌ముద్రం ఒడ్డున ఉన్న భ‌వ‌నం కూలింది. ఆ స‌మ‌యంలో అందులో ఎవ‌రు లేక‌పోవ‌డంతో ప్రాణాపాయం త‌ప్పింది. 20 ఏళ్లకోసారి సముద్రం ఇలా ముందుకు వెళ్తుందని స్థానికులు చెబుతున్నారు. అంతర్వేది వద్ద సముద్రం ముందుకు వస్తుండగా.. ఇక్కడికి 128 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉప్పాడ తీరం వద్ద సముద్ర జలాలు వెనక్కి వెళ్లడం గమనార్హం. అయితే, అంతర్వేదిలో అన్నాచెల్లెలి గట్టు అంటే చాలా ఫేమస్. ఇప్పుడక్కడ సముద్రం వెనక్కి వెళ్లిపోయింది. మరో కొన్ని చోట్ల సముంద్ర ఏడారి దీవులను తలపిస్తోంది. అనూహ్య మార్పులు ఏదైన ఉప్పెనకు సంకేతమా అని స్థానికులు బయపడుతున్నారు.