అంతర్వేదిలో మంత్రుల పై దాడులు చేసిన భక్తులు

Advertisement

తూర్పు గోదావరి జిల్లాలోని అంతర్వేదిలో ఉన్న లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ఉన్న కళ్యాణోత్సవ రథం కాలిపోయిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా లేక ఎవరైనా కావాలనే చేసారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే దీనిపై విచారణ చేయడానికి ప్రభుత్వం అధికారులను నియమించింది. అయితే అంతర్వేది వాసులు మాత్రం ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఇప్పటికే అంతర్వేదిలో భక్తులు ధర్నాలు చేస్తున్నారు.

ఇవ్వాళ అక్కడికి వెళ్లిన ఏపీ మంత్రులపై హిందు భక్తులు రాళ్లతో దాడులు చేశారు. బజరంగీ దళ్, హిందు పెద్దలతో మంత్రులు చర్చిస్తున్నారు. అలాగే నిర్లక్ష్యం వహించిన ఈఓపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన పై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎందుకు స్పందించడం లేదని బీజేపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో హిందుత్వాన్ని నాశనం చేసే కుట్ర జరుగుతుందని బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here