తెలంగాణాలో మరో వైరస్ భయంతో రైతులు

Advertisement

తెలంగాణాలో కరోనా వైరస్ భయాందోళనకు గురిచేస్తుంది. ఇది ఇలా ఉంటె తాజాగా తెలంగాణాలో మరో వైరస్ వ్యాప్తి చెందుతుంది. ఆదిలాబాద్ జిల్లా ప్రజలను భయాందోళనకు గురి చేస్తుంది. అదే లంపీ స్కిన్ అనే డిసీజ్ పశువులను వెంటాడుతోంది. అయితే ఈ వైరస్ మనుషులకంటే జంతువుల్లో తొందరగా వ్యాప్తి చెందుతుంది, పశువైద్యశాలల్లో ప్రస్తుత పరిస్థితుల్లో వైద్య సిబ్బంది కొరత, మందులు అందుబాటులో లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

అయితే ఈ వైరస్ మొదటగా వనపర్తి జిల్లాలో మొదలయ్యింది. అయితే ఇప్పుడు తాజాగా ఈ వైరస్ ఆదిలాబాద్ జిల్లాలో విజృంభిస్తూ జిల్లా రైతులను బయపెట్టిస్తుంది. ఈ లంపీ స్కిన్ వైరస్ బారిన పడిన జంతువుల చర్మంపై బొబ్బలు, బొడిపెలు వస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. అయితే ఈ వైరస్ కు ప్రభుత్వ వైద్యశాలల్లో మందులు లేకపోవడంతో ప్రైవేట్ మెడికల్ దుకాణాల నుంచి రైతులు మందులను కొనుగోలు చేస్తున్నారు. అయితే ఒక్క పశువుకు 1500 రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుందని రైతులు తెలుపుతున్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here