ఏపీలో మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు కరోనా

Advertisement

కరోనా ఏపీలో ఉగ్రరూపం దాల్చుతుంది. ప్రతిరోజు రాష్ట్రంలో పది వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీనితో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో చాలా మంది ప్రజా ప్రతినిధులు కరోనా బారిన పడి కోలుకున్న విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటె తాజాగా రాష్ట్రంలో మరో ఇద్దరు ఎమ్మెలేలు కరోనా బారిన పడ్డారు. వివరాల్లోకి వెళితే గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే), ప్రభుత్వ విప్ తూర్పుగోదావరి జిల్లా తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా ఇద్దరు కూడా కరోనా బారిన పడ్డారు.

రామకృష్ణ రెడ్డి కి కరోనా లక్షణాలు ఉండడంతో టెస్టులు చేయించుకోగా పాజిటివ్ అని తేలింది. దీనితో ఆయన క్వారంటైన్ లోకి వెళ్లారు. అలాగే కొద్దీ రోజులుగా తనను కలసిన వారు కరోనా టెస్టులు చేయించుకొని, క్వారంటైన్ లో ఉండాలని సూచించాడు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here