సీరియల్ నటి శ్రావణి కేసులో మరో ట్విస్ట్

Admin - September 16, 2020 / 06:57 AM IST

సీరియల్ నటి శ్రావణి కేసులో మరో ట్విస్ట్

సీరియల్ నటి శ్రావణి ఆత్మహత్య కేసులో రోజుకో ట్విస్ట్ బయటకు వస్తుంది. తాజాగా ఈ కేసుకు సంబందించిన రిమాండ్ రిపోర్ట్ ను పోలీసులు రెడీ చేశారు. ఇక ఈ రిపోర్ట్ లో ఏ1 గా దేవరాజ్ రెడ్డి, ఏ2 గా సాయిరెడ్డి మరియు ఏ3 గా నిర్మాత అశోక్ రెడ్డిని చేర్చారు. ఈ ముగ్గురు వ్యక్తుల వేధింపుల కారణంగా ఒత్తిడికి గురైన నటి శ్రావణి ఆత్మహత్యకు పాల్పడింది. అయితే ఈ కేసులో పోలీసులు 17 మంది సాక్షులను విచారణ చేపట్టారు.

ఇక పోలీసుల అదుపులో ఉన్న దేవరాజ్ రెడ్డి, సాయికృష్ణల ఇద్దరినీ కూడా పోలీసులు రిమాండ్ కు తరలించారు. అయితే, సోమవారం రోజున విచారణకు వస్తానని చెప్పిన నిర్మాత అశోక్ రెడ్డి పరార్ కావడంతో అతనికోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ కేసులో నిర్మాత అశోక్ రెడ్డి కీలక వ్యక్తిగా ఉండటంతో ఆయన కోసం పోలీసులు గాలింపు చర్యలు మొదలు పెట్టారు.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us