సీరియల్ నటి శ్రావణి కేసులో మరో ట్విస్ట్

Advertisement

సీరియల్ నటి శ్రావణి ఆత్మహత్య కేసులో రోజురోజుకు ట్విస్టుల మీద ట్విస్టులు బయటకు వస్తున్నాయి. అయితే శ్రావణికి టిక్ టాక్ ద్వారా పరిచయం అయిన దేవరాజ్ ద్వారానే ఆత్మహత్య చేసుకున్నట్లు శ్రావణి తల్లిదండ్రులు పోలీసులకు పిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీనితో దేవరాజ్ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. ఇక దేవరాజ్ పోలీసులకు పలు విషయాలు తెలిపాడు. అయితే సాయికృష్ణ, శ్రావణి కుటుంబ సభ్యులు కొట్టడంతోనే ఆమె ఆత్మహత్యకు చేసుకుందని తేలింది. ఈ మేరకు శ్రావణి, దేవరాజ్ ‌తో మాట్లాడిన ఆడియో రికార్డులు బయటకు వచ్చాయి.

అయితే తన చావుకు సాయి కారణమని ఆ రికార్డుల్లో శ్రావణి చెప్పిన కొన్ని సాక్షాలు బయటకు వచ్చాయి. అలాగే ఒకసారి సాయి నన్ను రక్తం వచ్చేలా కొట్టాడని దేవరాజ్ వాపోయాడు. సాయి అమ్మాయిలను ట్రాప్ చేస్తాడని, అలాగే శ్రావణిని కూడా ట్రాప్ చేసాడని తెలిపాడు. తన నుండి శ్రావణిని విడిపోవాలంటూ వేధింపులకు గురి చేసాడని తేలింది. అలాగే ఈ కేసులో ఆర్ ఎక్స్ 100 మూవీ నిర్మాత పేరు కూడా వినిపిస్తుంది. ఒకవైపు ఈ కేసులో దోషులు ఎవరైనా శిక్ష పడుతుంది అని పోలీసులు చెపుతున్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here