యాంకర్ ప్రదీప్ నన్ను ఏం చేయలేదు. 139 మంది కేసులో మరో ట్విస్ట్

Advertisement

పంజాగుట్ట పీస్ లో 139 మంది రేప్ చేసారంటూ ఓ బాధితురాలు పెట్టిన కేసులో చాలా మంది ప్రముఖుల పేర్లు వెలుగులోకి వచ్చాయి. అయితే ఈరోజు మీడియా సమావేశంలో మాట్లాడిన బాధితురాలు సంచలన విషయాలు తెలిపింది. అయితే నన్ను నా ఫ్యామిలీని చంపేస్తానని
డాలర్ భాయ్ బెదిరించాడు అని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. అలాగే డాలర్ బాయ్ నన్ను చిత్ర హింసలకు గురి చేసాడని వెల్లడించింది.
అలాగే తన పై లైంగిక దాడి జరిగింది వాస్తవమే అని వివరించింది.

కాని ఈ ఘటనలో సెలబ్రిటీలు లేరని స్పష్టం చేసింది. యాంకర్ ప్రదీప్ కి తనకు ఏమీ సంబంధం లేదని రేప్ కేసు బాధితురాలు ప్రకటించింది. అలాగే కొంతమందితో సంబంధం లేకున్నా, ఎంత చెప్పినా వినకుండా డాలర్ బాయ్ అనవసరంగా కేసులో పేర్లు పెట్టించాడని ఆమె ఆరోపణ చేసింది. తాను బయట యాభై శాతం వేధింపులు కు గురయ్యానని తెలిపింది. ఇక మిగిత యాభై శాతం డాలర్ భాయ్ వేదించాడని విమర్శలు చేసింది. అనవసరంగా ఇబ్బంది పడిన వారికీ క్షమాపణలు చెపుతున్న అని ప్రాధేయ పడింది.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here