త్వరలో పెళ్ళికి సిద్ధం అవుతున్న మరో యువ హీరో

Advertisement

టాలీవుడ్ లో ఈ మధ్య యువ హీరోలు అందరు పెళ్లిళ్లు చేసుకొని ఒక ఇంటివారయ్యారు. అయితే కరోనా దృష్ట్యా పెళ్లిళ్లకు ఆటంకాలు వచ్చిన ప్రభుత్వ నియమ నిబంధనలతో పెళ్లిలు చేసుకున్నారు. అయితే ఇప్పటికి హీరోలు నిఖిల్, నితిన్ మరియు దగ్గుబాటి రానా ఈ ముగ్గురు కూడా పెళ్లిళ్లు చేసుకొని ఓ ఇంటివారయ్యారు. ఇక వీరి బాటలోనే నడవనున్నాడు హీరో శర్వానంద్. అయితే తాను కూడా పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. శర్వానంద్ పెళ్లి చేసుకునే అమ్మాయి వ్యాపారవేత్త గా ఉందని వార్తలు వస్తున్నాయి.

అలాగే లాక్ డౌన్ సమయంలో వీరిద్దరి ప్రేమ విషయాన్ని ఇంట్లో వాళ్లకు చెప్పడం రెండు కుటుంబాల వారు మాట్లాడుకోవడం జరిగిపోయిందని సమాచారం. వీలైతే ఈ సంవత్సరంలో పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాడు అంట. ఒకవేళ కుదరకపోతే ఈ సంవత్సరం నిశ్చితార్థం చేసుకొని వచ్చే సంవత్సరం లో పెళ్లి జరుగుతుందని సమాచారం వస్తుంది. ఇక పెళ్లి కి సంబందించిన విషయాలు త్వరలో వెల్లడించనున్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here