రానా సినిమాలో నటించనున్న అల్లు అర్జున్

Advertisement

టాలీవుడ్ లో గత కొన్ని ఏళ్లుగా భారీ బడ్జెట్‌ తో ఒక సినిమా వస్తుంది అని వార్తలు వచ్చాయి. అయితే రానా హీరోగా ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ కాంబినేషన్ లో హిరణ్య కశ్యప అనే సినిమాను ‌ తెరకెక్కించబోతున్నారు. కొన్ని రోజుల క్రితం గుణశేఖర్ ఈ సినిమా గురించి ఓ ప్రకటన చేసాడు. ‘హిరణ్య కశ్యప’ అనే సినిమాను రానాతో చేయబోతున్నట్లు, ప్రీప్రొడక్షన్‌ పనులు కూడా జరుగుతున్నాయని, త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు స్వయంగా ఆయనే తెలిపాడు.

ఇది ఇలా ఉంటె తాజాగా ఈ సినిమాకు సంబందించిన మరో వార్త ఫిలింనగర్ లో తెగ ప్రచారం అవుతుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబందించిన స్క్రిప్ట్ వర్క్ గుణశేఖర్ పూర్తి చేసాడు. అంతేకాదు ఈ సినిమాలో ఒక కీలక పాత్రకోసం అల్లు అర్జున్ ను తీసుకోవాలని తెగ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇక గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన రుద్రమదేవి సినిమాలో అల్లు అర్జున్ గోన గన్నారెడ్డి పాత్రలో నటించిన విషయం అందరికి తెలిసిందే. అయితే ఆ సినిమా అల్లు అర్జున్ కు మంచి గుర్తింపును కూడా తెచ్చింది. ఒకవైపు సినిమాలతో బిజీ గా ఉన్నాడు అల్లుఅర్జున్. మరి హిరణ్య కశ్యప సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో లేదో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here