మరో ముఖ్యమంత్రికి కరోనా

Advertisement

కరోనా దేశంలో విలయతాండవం చేస్తుంది. ఇప్పటికే కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రముఖ నాయకులు అందరు కూడా కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటె తాజాగా మరో ముఖ్యమంత్రి కరోనా బారిన పడ్డాడు. గోవా రాష్ట్ర సీఎం ప్రమోద్ సావంత్ ‌కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అయితే ఆయనకు ఎలాంటి కరోనా లక్షణాలు లేనప్పటికీ పరీక్షలు చేయించుకోగా.. రిపోర్టులో కరోనా పాజిటివ్‌గా తేలింది. ఇక వైద్యుల సూచనల మేరకు ఆయన హోమ్ క్వారంటైన్ లోకి వెళ్లారు. అలాగే తన నివాసం నుండే విధులు నిర్వహిస్తున్నాడు.

తనను గత కొన్ని రోజులుగా కలిసిన వారందరు కూడా కరోనా పరీక్షలు చేయించుకోవాలని తెలిపాడు. అలాగే కొన్ని రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉండాలని వారికీ సీఎం ప్రమోద్ సావంత్ సూచించారు. అయితే ఇప్పటికే ముగ్గురు సీఎంలు కరోనా బారిన పడ్డారు. కర్నాటక సీఎం బీఎస్ యడియూరప్ప, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్‌కు కరోనా సోకింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here