రష్యాలో దారుణం మహిళా గొంతులో పాము

Advertisement

రష్యా దేశంలోని లవాషి గ్రామంలో దారుణమైన సంఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే ఒక మహిళ నోరు తెరచి , స్పందన లేకుండా నిద్ర పోతున్న సమయంలో ఆమె నోట్లోకి పాము పోయింది. ఇక వెంటనే డాక్టర్లు ఆపరేషన్ చేసారు‌. ఇక ఆ ఆపరేషన్ లో పొడవైన పాము బయట పడింది. ఈ వీడియో ఇప్పుడు ఇంటర్‌నెట్‌ను తెగ చక్కర్లు కొడుతుంది. ఆ మహిళ నోట్లో నుంచి నాలుగు అడుగుల పొడవైన పామును బయటకు తీస్తున్నట్లు వీడియోలో కనిపిస్తుంది.

ఇక ఆ పామును బయటకు తీసే సమయంలో నర్సు ముఖంలో భయం స్పష్టంగా కనిపిస్తుంది. ఇక ఆమె ఆ పామును ఆ నర్సు చేతుల్లోకి తీసుకొని ఓ డబ్బాలో వేసింది. ఆ పాము ఇంకా బతికే ఉందే లేదో ఇంకా తెలియలేదు. అసలు ఆ పాము మహిళ నోట్లోకి ఎలా ప్రవేశించిందో అని డాక్టర్లు ఆలోచనలో పడ్డారు. ఇక ఆ ఆపరేషన్ తరువాత ఆ మహిళా ఆరోగ్యంగానే ఉందని డాక్టర్లు వెల్లడించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here