ఇంగ్లీష్ మీడియం విషయంలో జగన్ ప్రభుత్వానికి మళ్ళీ సుప్రీంలో చుక్కెదురు

Advertisement

అధికారంలోకి వచ్చిన తరువాత వైసీపీ ప్రభుత్వం ఇప్పటికే దాదాపు 100 సార్లు కోర్ట్ దగ్గర ఎదురుదెబ్బలు తగిలాయి. ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయం కోర్ట్ లో ఆగిపోతుంది. ఇప్పటికే డాక్టర్ సుధాకర్ విషయంలో, ఈసీ రమేష్ కుమార్ విషయంలో, ప్రభుత్వ కార్యాలయాలకు రంగుల విషయంలో, మూడు రాజధానుల విషయంలో ఇలా పలుసార్లు కోర్ట్ దగ్గర చివాట్లు పడ్డాయి. అయితే ఇప్పుడు మళ్ళీ మరోసారి సుప్రీం కోర్ట్ దగ్గర ప్రభుత్వానికి అడ్డంకి ఏర్పడింది.

స్కూల్ లో ఇంగ్లీష్ మీడియంను స్టార్ట్ చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని రాష్ట్ర హై కోర్ట్ స్టే విధించింది. అయితే వైసీపీ ప్రభుత్వం హై కోర్ట్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్ట్ కు వెళ్ళింది. ఈ పిటిషన్ పై సుప్రీం ఇవ్వాళ విచారణ చేయగా హై కోర్ట్ ఇచ్చిన తీర్పును తాము మార్చలేమని సుప్రీం కోర్ట్ వెల్లడించింది. ఈ తీర్పుతో వైసీపీ ప్రభుత్వానికి మళ్ళీ షాక్ తగిలింది. వైసీపీ ప్రభుత్వం అనుభవ రాహిత్యం వల్ల ఇలా ఇబ్బందులు ఎదుర్కొంటుందా లేక న్యాయ నిపుణులు సరైన సలహాలు ఇవ్వడం లేదా అని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here