టిక్ టాక్ కు మరో షాక్. అసలు ఏమైందంటే..

Advertisement

టిక్ టాక్ పరిస్థితి దారుణంగా తయారయ్యింది. ఇప్పటికే చైనా, భారత్ దేశ సరిహద్దుల వద్ద జరిగిన సంఘటన వల్ల భారత్ లో టిక్ టాక్ ను కేంద్ర ప్రభుత్వం నిషేదించింది. అయితే ప్రపంచంలో టిక్ టాక్ కు ఎక్కువగా ఫాలోవర్లు ఉన్న దేశం భారత్. ఇక భారత్ లో టిక్ టాక్ కు ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. ఇక భారత్ లో టిక్ టాక్ నిషేధించే సరికి భారీగా నష్టపోయింది అనే చెప్పుకోవాలి. ఇక భారత్ దారిలోనే అగ్ర దేశం అమెరికా కూడా అడుగులు వేస్తుంది. అమెరికా కూడా తమ దేశంలో టిక్ టాక్ ను నిషేదిస్తున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు రోనాల్డ్ ట్రంప్ ప్రకటించాడు.

ఇది ఇలా ఉంటె తాజాగా టిక్ టాక్ కు మరో చిక్కు వచ్చి పడింది. అయితే టిక్ టాక్ సీఈఓ కెవిన్ మేయర్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తాను రాజీనామా చేస్తున్నట్లు పేర్కొంటూ కెవిన్ టిక్‌టాక్ సిబ్బందికి ఓ లేఖ కూడా రాశారు. తాను టిక్ టాక్ నుండి తప్పుకుంటున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నాడు కెవిన్ మేయర్. ఇక టిక్ టాక్ కు ఒకదానివెనుక ఒకటి దెబ్బ మీద దెబ్బ పడుతుంది అని పలువురు అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here