ఏపీ ప్రభుత్వానికి సుప్రీం కోర్ట్ లో మళ్ళీ ఎదురుదెబ్బ

Advertisement

ఢిల్లీ: ఏపీ ప్రభుత్వం గత కొన్ని రోజుల నుండి హై కోర్ట్, సుప్రీం కోర్టుల నుండి ఎదురుదెబ్బలు తింటూనే ఉంది. గతంలో డాక్టర్ సుధాకర్ విషయంలో, ఈసీ రమేష్ కుమార్ విషయంలో, ప్రభుత్వ కార్యాలయాలకు రంగుల విషయంలో ఇలా ప్రతిసారి కోర్ట్ ల వ్యతిరేక తీర్పులు అందుకుంటుంది. తాజా మూడు రాజధానుల వ్యవహారంలో కూడా ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై స్టేటస్ కో విధిస్తూ రాష్ట్ర హై కోర్ట్ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.

అయితే ఇప్పుడు తాజాగా అమరావతిలో ఇళ్ల స్థలాల పంపిణీ, ఆర్5 జోన్ విషయంలో హైకోర్టు ఉత్తర్వులను దేశ సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది. హైకోర్టు విచారణ సరిగానే జరిగిందని సీజేఐ బొబ్డే అభిప్రాయపడ్డారు. హైకోర్టులో కేసు తుది విచారణ ముగించాలని సుప్రీంకోర్టు సూచించింది. గతంలో అమరావతిలో ఇళ్ల స్థలాల పంపిణీ, ఆర్5 జోన్ విషయంలో హై కోర్ట్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకు వెళ్లిన ఏపీ ప్రభుత్వం మళ్ళీ చుక్కెదురు అయ్యింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here