పోలీస్ స్టేషన్ నుంచి కిడ్నాప్ చేసి ఆ పై అత్యాచారం..

Advertisement

పదహారు ఏళ్ల బాలికను పోలీస్ స్టేషన్ నుండి కిడ్నాప్ చేసి, ఆ బాలిక పై అత్యాచారం చేసారు. ఈ ఘోరమైన సంఘటన ఉత్తర ప్రదేశ్‌లోని ఈతాహ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లవ్ కుశ్ అనే యువకుడు ఆగస్ట్ 21వ తేదీన పోలీస్ కస్టడీలో ఉన్న బాలికను కిడ్నాప్ చేసి ఢిల్లీకి తీసుకెళ్లాడు. అతడు ఆ బాలిక పై అత్యాచారం చేసి అక్కడ నుండి పరారయ్యాడు. అలాగే ఢిలీ వీధుల్లో ఆ బాలిక పై మరో ఆరుగురు అత్యాచారం చేశారు.

అయితే పోలీస్ స్టేషన్ లో మహిళ కానిస్టేబుల్ బాత్‌రూమ్‌ కు వెళ్లినప్పుడు ఆమే డోర్ లాక్ చేసి బాలికను కిడ్నాప్ చేసినట్టు పోలీసులు తెలిపారు. ఇక ఆగస్ట్ 27వ తేదీన పోలీసులు గురుగ్రామ్ ప్రాంతం‌లో బాలికను పట్టుకున్నారు. అలాగే ఈ ఘాతకంలో 12 మంది పై కేసు నమోదు చేశామని, ప్రధాన నిందితుడు లవ్ కుశ్ ‌గా గుర్తించామని పోలీసులు వెల్లడించారు. గతంలో బాలికను పెళ్లి చేసుకుంటానని లవ్‌కుశ్ కోరగా ఆమె తిరస్కరించిందన్నాడు. ఆఖ్లాగే ఈ ఘటనలో ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేసినట్టు తెలుస్తుంది.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here