రైల్వే సహాయ మంత్రికి కరోనా
Admin - September 12, 2020 / 05:13 AM IST

దేశంలో కరోనా ఉగ్రరూపం దాల్చుతుంది. ఇప్పటికే సినీ, రాజకీయ ప్రముఖులు చాలా మంది ఈ మహమ్మారి బారిన పడ్డారు. దాంట్లో కేంద్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఇలా చాలా మంది కరోనా బారిన పడి కోలుకున్నారు. ఇది ఇలా ఉంటె తాజాగా కేంద్ర రైల్వే సహాయ మంత్రి సురేష్ అంగడి కి కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది.

అయితే తనకు కరోనా లక్షణాలు ఉండడంతో టెస్టులు చేయించుకోగా రిపోర్టులో పాజిటివ్ అని తేలింది. ఇక ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అలాగే గత కొన్ని రోజులుగా తనను కలిసిన వారు తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని, ఎవరికైన కరోనా లక్షణాలు ఉంటె టెస్టులు చేయించుకోవాలని ఆయన సూచించారు.