New Virus: వ‌ణికిస్తున్న మ‌రో కొత్త ర‌కం వైర‌స్.. ఆఫ్రికాలో తొలి మ‌ర‌ణం

Samsthi 2210 - August 16, 2021 / 04:32 PM IST

New Virus: వ‌ణికిస్తున్న మ‌రో కొత్త ర‌కం వైర‌స్.. ఆఫ్రికాలో తొలి మ‌ర‌ణం

New Virus: క‌రోనా మ‌హ‌మ్మారి పీడ విర‌గ‌డ కాక‌ముందే కొత్త‌ర‌కం వైర‌స్‌లు పుట్టుకొస్తున్నాయి. ప్ర‌పంచాన్ని క‌బ‌ళించేందుకు సిద్ధంగా ఉన్న‌ట్టు ఈ వైర‌స్‌లు ముప్పేట దాడి చేస్తున్నాయి. తాజాగా మరో ప్రాణాంతకమైన మార్బర్గ్ వైరస్ బయటపడింది. ఆఫ్రికాలోని పశ్చిమ ప్రాంతం గినియా దేశంలో ప్రాణాంతకమైన మార్బర్గ్ వైరస్ బారినపడి ఓ వ్యక్తి మరణించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) వెల్లడించింది.

గత జులై25న ఓ వ్యక్తి తనకు జ్వరం, తలనొప్పి, అలసట, కడుపునొప్పిగా ఉందంటూ ఓ వ్యక్తి ఆసుపత్రిలో చేరాడు. ఆగస్టు 1న అతనికి చికిత్స అందించడం మొదలుపెట్టారు. కానీ మరుసటి రోజే అతను చనిపోయాడు. దాంతో స్థానిక వైద్యాధికారులు వెంటనే అతడి మరణానికి గల కారణాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అత‌ను మార్క్‌బర్క్ వైరస్ బారిన పడినట్లు గుర్తించారు.

ఈ వైర‌స్ గ‌బ్బిలాల ద్వారా మ‌నుషుల‌కు సోకుతుంద‌ని, దీనివల్ల మరణాల రేటు భారీగా ఉంటుందని డబ్ల్యూహెచ్‌ఓ ప్రకటించింది. దక్షిణ గెక్‌కెడౌ ప్రిఫెక్చర్‌ ప్రాంతంలో తొలి మార్‌బర్గ్‌ కేసును గుర్తించినట్లు ఆఫ్రికా డబ్ల్యూహెచ్‌ఓ రీజనల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ మత్షిడిసో మోయెటి తెలిపారు. మార్‌బర్గ్‌ వైరస్‌ చాలా దూరం వ్యాప్తి చెందే అవకాశం ఉందని.. దానిని ట్రాక్‌ చేయాల్సిన అవసరం ఉందని మత్షిడిసో పేర్కొన్నారు.

ఎబోలా వైరస్ లక్షణాలు కలిగిన ఈ వైరస్ కోవిడ్-19 మాదిరిగానే జంతువుల నుంచి మనుషులకు వ్యాపిస్తుందని తెలిపింది. గినియాలో గతేడాది ఎబోలా వైరస్ సోకి 12 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ వైరస్‌ను అరికట్టిన కొద్ది నెలల్లోనే మార్బర్గ్ వైరస్ బయటపడటం ఆందోళన కలిగిస్తోందని డబ్ల్యూహెచ్‌ఓ పేర్కొంది. పశ్చిమ ఆఫ్రికాలో వైరస్ కనుగొనడం ఇదే మొదటిసారని డబ్ల్యూహెచ్‌ఓ పేర్కొంది.

డబ్ల్యూహెచ్‌ఓ ప్రకారం 1967లో జర్మనీ, బెల్‌గ్రేడ్‌, సెర్బియాలో ఒకేసారి రెండు అంటువ్యాధులు వెలుగు చూశాయి. ఈ క్రమంలోనే మార్‌బర్గ్‌, ప్రాంక్‌ఫర్ట్‌ వ్యాధులను గుర్తించారు. ఉగాండ నుంచి దిగుమతి చేసుకున్న ఆఫ్రీకన్‌ ఆకుపచ్చ కోతుల మీద పరిశోధన చేస్తున్న ల్యాబ్‌ నుంచి ఈ రెండు అంటువ్యాధులు బయటకు విడుదల అయ్యాయి. మార్‌బర్గ్‌ వైరస్‌ సోకిన వ్యక్తుల రక్తం, స్రావలు, అవయవాలు, ఇతర శరీర ద్రవాలు, వీటితో కలిసిన ఉపరితలాలు, ఇతర పదార్ధాల ద్వారా.. ఇది ఇతరులకు సోకుతుంది.

మార్‌బర్గ్‌ వైరస్ బారిన పడిన వ్యక్తికి అధిక జ్వరం, తీవ్రమైన తలనొప్పి, కండరాల నొప్పులతో పాటు తీవ్రమైన అనారోగ్యం ఉంటుంది. ఇవేకాక మూడవరోజు నుంచి తీవ్రమైన నీటి విరేచనాలు, కడుపు నొప్పి, తిమ్మిరి, వికారం, వాంతులు ప్రారంభమవుతాయి. ఈ వ్యాధి సోకిన వారికి విప‌రీత‌మైన బ‌ద్ధకం ఉంటుంది. అన్ని వ్యాధుల మాదిరిగా మార్ బ‌ర్గ్‌ను గుర్తించ‌డం క‌ష్టం. యాంటిజెన్ డిటెక్షన్ పరీక్షలు, సీరం న్యూట్రలైజేషన్ పరీక్షలు, సెల్ కల్చర్, ఆర్‌టీపీసీఆర్‌ ఉపయోగించి వైరస్ నిర్ధారణ చేయవచ్చిన తెలిపింది.

ఈ వైరస్ సోకిన తర్వాత బాధితుడిపై 7 రోజులపాటు తీవ్ర ప్రభావం ఉంటుందని, దీనివల్ల రక్తనాళాలు చిట్లిపోయే ముప్పు ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఇక ఈ వైరస్ బారిన పడిన వ్యక్తి మరణించే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుందని డబ్ల్యూహెచ్‌వో హెచ్చరించింది. కోవిడ్ మాదిరిగా ఈ వ్యాధికి స‌రైన చికిత్స‌, ఔష‌దాలు లేవ‌ని డ‌బ్ల్యూ హెచ్ఓ పేర్కొంది.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us