కరోనా వైరస్ కు కొత్త లక్షణం ఏంటో తెలుసా..!

Advertisement

కరోనా సోకిందంటే మాములుగా దగ్గు, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండడం ఇవన్నీ కూడా కరోనా కు లక్షణాలు. అయితే తాజాగా మరో లక్షణం బయట పడింది. అయితే అమెరికన్ జర్నల్ ఆఫ్ ఎమర్జెన్సీ మెడిసిన్ లో నివేదికను ప్రచురించారు. వివరాల్లోకి వెళితే చికాగోకు చెందిన ఓ 62 ఏళ్ళ వ్యక్తి నాలుగు రోజులుగా ఎక్కిళ్ళు ఎదుర్కొంటున్నాడు. అయితే అతడిలో కరోనా వైరస్ సోకిందని చెప్పడానికి వేరే ఇతర లక్షణాలు ఏవి కూడా కనిపించలేదు.

జ్వరం వచ్చిన తరువాత అతడి ని ఆసుపత్రికి తీసుకువచ్చారు. వరుసగా 48 గంటల పాటు ఎక్కిళ్ళు ఆగకుండా వచ్చాయి. అనుమానంతో కరోనా పరీక్షలు జరుపగా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. ఇలాగే వరుసగా నాలుగు రోజులపాటు ఎక్కిళ్లు ఆగిపోకపోతే కరోనాగా భావించి వైద్యుడిని సంప్రదించాలని అమెరికన్ నిపుణులు సూచిస్తున్నారు. ఊపిరితిత్తుల జర్నల్ ప్రకారం బాధితునికి ఎక్కిళ్ళు తప్ప జ్వరం మాత్రమే ఉంది. సదరు మనిషి ఇంతకు ముందు ఏ వ్యాధితో బాధపడలేదు. దీనితో ఎక్కిళ్ళను కూడా కొత్త లక్షణంగా నిర్దారణ చేసారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here