ఏపీలో మరో ఎమ్మెల్యే కు కరోనా

Advertisement

ఏపీలో కరోనా రోజురోజుకు దారుణంగా పెరుగుతుంది. ఇప్పటికే రోజుకు పది వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే చాలా మంది ప్రజా ప్రతినిధులు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటె తాజాగా ఓ ఎమ్మెల్యే కరోనా బారిన పడ్డారు. వివరాల్లోకి వెళితే తూర్పు గోదావరి లోని పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబుకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

అయితే రెండు, మూడు రోజులుగా అనారోగ్యంగా ఉండటంతో ఆయన స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో కరోనా పరీక్ష చేయించుకున్నారు. దీనితో కరోనా పాజిటివ్ అని తేలింది. వైద్యుల సూచనల మేరకు కాకినాడలోని ఓ ఆసుపత్రిలో చేరాడు. అలాగే తనను కలసిన వారందరు కూడా కరోనా టెస్టులు చేయించుకోవాలి అని ఆయన సూచించాడు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here