కరోనా తో కాంగ్రెస్ ఎమ్మెల్యే మృతి

Advertisement

ప్రపంచాన్ని కరోనా మహమ్మారి గడగడలాడిస్తుంది. ఇక దేశంలో కూడా ఈ మహమ్మారి తీవ్రత రోజురోజుకు దారుణంగా పెరుగుతుంది. ఇక సామాన్యులనుండి సినీ, రాజకీయ నాయకులూ చాలా మంది ఈ మహమ్మారి బారిన పడ్డారు. తాజాగా మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో బియోరా నియోజకవర్గనికి చెందిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యే గోవర్ధన్‌ డాంగి కరోనా వైరస్ సోకి మృతి చెందారు. అయితే కొన్ని రోజుల క్రితం ఆయనకు కరోనా పాజిటివ్ గా అని నిర్ధారణ అయింది.

దీంతో రాష్ట్ర రాజధాని భోపాల్‌లోని చిరాయు ఆసుపత్రిలో ఉండి చికిత్స పొందారు. ఇక తాజాగా ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఢిల్లీ సమీపంలోని గురుగ్రామ్ లో ఉన్న మేదాంత ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ మంగళవారం రోజున ఆయన తుది శ్వాస విడిచారు. మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ మరియు ఇతర రాజకీయ ప్రముఖులు ఆయన మృతికి సంతాపం తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here