హోంమంత్రికి కరోనా పాజిటివ్

దేశంలో కరోనా ఉగ్రరూపం దాల్చుతుంది. ఇప్పటికే సినీ, రాజకీయ నాయకులను ఈ మహమ్మారి అస్సలు వదలడం లేదు. ఇప్పటికే చాలా మంది ప్రజాప్రతిధులు ఈ వైరస్ బారిన పడ్డారు. ఇక కర్ణాటక రాష్ట్రంలో కరోనా శరవేగంగా విస్తరిస్తుంది. అయితే తాజాగా ఆ రాష్ట్ర హోంమంత్రి బసవరాజ్ సోమప్ప బొమ్మైకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఇక ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. అయితే తన నివాసంలో పని చేసే ఒక వ్యక్తికి నిన్న కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.

దీనితో ఆయన కూడా కరోనా టెస్టులు చేయించుకోగా పాజిటివ్ అని తేలింది. అయితే ఆయనకు కరోనా లక్షణాలు లేనప్పటికీ పాజిటివ్ అని తేలిందని తెలిపాడు. ఇక ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని పేర్కొన్నాడు. అలాగే కొన్ని రోజులుగా తనను కలిసిన వారందరు కూడా కరోనా టెస్టులు చేయించుకోవాలని ఆయన సూచించాడు.