మహిళ పై 12 మంది గ్యాంగ్ రేప్

Advertisement

నిజామాబాద్ జిల్లాలో అర్ధరాత్రి దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ మహిళపై ఏకంగా 12 మంది యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఇక వివరాల్లోకి వెళితే నిజామాబాద్ జిల్లా ఎడవెల్లి మండలంకు చెందిన ఒక మహిళా రోడ్డు ప్రమాదంలో గాయపడింది. అయితే బాధితురాలిని ఆమె సోదరి నిజామాబాద్ లోని ఓ ప్రైవేటు హాస్పిటల్ లో అడ్మిట్ చేసింది. అయితే చిన్న పని రాత్రి నిజామాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలోకి వెళ్లింది.

ఇక ఒంటరిగా కనిపించిన ఆ మహిళను విక్కీ అనే యువకుడు చూసాడు. ఇక ఆమెతో మాటలు కలిపి తనకు సహాయం చేస్తానని నమ్మించాడు. అలాగే కలెక్టరేట్‌ దగ్గర ఉన్న ధర్నా చౌక్‌ ప్రాంతానికి ఆ మహిళను తీసుకెళ్లాడు. ఇక రెవెన్యూ భవన్‌కు దగ్గర ఉన్న ఖాళీ గదిలో అత్యాచారానికి పాల్పడ్డాడు. తరువాత విక్కీ స్నేహితులు 11 మంది ఆ స్థలానికి చేరుకుని ఒకరి తరువాత మరొకరు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఇక ఆ సమయంలో పోలీస్‌ పెట్రోలింగ్‌ వాహనం రావడాన్ని గమనించిన ఆ యువకులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.

ఇక పోలీసు సిబ్బంది ఆ అమ్మాయి ని ప్రశ్నించగా జరిగిన విషయం తెలిపింది. ఇక ఆ మహిళను దగ్గర లో ఉన్న హాస్పిటల్ కు తరలించారు. నగరంలోని హమాల్‌వాడీకి చెందిన యువకులు ఈ ఆఘాయిత్యానికి పాల్పడ్డారని, అలాగే విక్కీ పెయింటర్‌గా పని చేస్తున్నాడని వన్‌టౌన్‌ ఎస్‌హెచ్‌వో ఆంజనేయులు వెల్లడించాడు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here