ఏపీలో ఎమ్మెల్సీకి కరోనా పాజిటివ్

Advertisement

కరోనా ఏపీ లో దారుణంగా విస్తరిస్తుంది. రోజుకు పది వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఒకవైపు ఇప్పటికే చాలా మంది రాజకీయ ప్రముఖులు ఈ మహమ్మారి బారిన పడిన విషయం అందరికి తెలిసిందే. ఇది ఇలా ఉంటె తాజాగా టీడీపీ సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న కరోనా బారిన పడ్డారు. అయితే తనకు కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయ్యిందని, అలాగే 14 రోజులు క్వారంటైన్ కు వెళ్తున్నానని తానే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు.

ఇక ఈ 14 రోజులు రాజకీయాలకు, ఇతర కార్యక్రమాలకు దూరంగా ఉంటానని తెలిపాడు. అలాగే పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, కార్యకర్తల ఆశీస్సులతో కరోనా‌ను జయిస్తానని పేర్కొన్నాడు. ఇక త్వరలోనే తిరిగి రాజకీయ కార్యక్రమాలకు హాజరవుతానని వెల్లడించాడు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here