తెలంగాణాలో మరో అగ్ని ప్రమాదం

Advertisement

తెలుగు రాష్ట్రాలలో ఈ మధ్య అనేక ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఇది ఇలా ఉంటె తాజాగా తెలంగాణాలో మరో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం పాశమైలారంలోని పిల్లట్ ఫార్మా కంపెనీలో నిన్న రాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ అగ్నిప్రమాదంలో ఒక సీనియర్ ఆపరేటర్ మృతి చెందాడు. పెద్ద ఎత్తున మంటలు రావడంతో సినియర్ ఆపరేటర్ రామకృష్ణ అగ్నికి ఆహుతయ్యాడు. చాలా సేపటి తరువాత మంటలు అదుపులోకి వచ్చాయి.

అయితే ఓ కార్మికుడు మిస్ అయినట్లు యాజమాన్యం గుర్తించింది. దీనితో మంటలు ఆరిపోయిన తరువాత కార్మికుడు మృతి చెందిన విషయాన్ని గుర్తించింది.అయితే పెద్ద ఎత్తున మంటల వల్ల విషవాయువులు వ్యాప్తి చెందడం, భవనం పెచ్చులు ఊడి పడటంతో అతడు బయటికి రాలేకపోయాడని తెలిపింది. ఈ ప్రమాదానికి గల కారణం తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here