కరోనా భారిన పడిన కేంద్ర మంత్రి

Advertisement

కరోనా దేశాన్ని వణికిస్తోంది. ఇప్పటికే చాలా మంది ప్రముఖులు ఈ మహమ్మారి బారిన పడ్డారు. ఇప్పటికే కేంద్ర మంత్రులలో అమిత్ షా, ధర్మేంద్ర ప్రధాన్‌లు కరోనా బారిన పడ్డ సంగతి తెలిసిందే. తాజాగా ఈ జాబితాలో మరోక మంత్రి చేరారు. కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షేకావత్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని ట్విట్టర్‌ ద్వారా ఆయనే స్వయంగా వెల్లడించారు.

అయితే కొద్దీ రోజులుగా అనారోగ్యంగా ఉన్న ఆయన, ఆసుపత్రికి వెళ్ళాడు. ఆసుపత్రిలో టెస్టులు చేయించుకోగా కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. ఇక వైద్యుల సూచనల మేరకు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అలాగే తనను కలిసిన వారందరు కూడా కరోనా టెస్టులు చేయించుకోవాలి అని ఆయన సూచించాడు. అలాగే హోమ్ క్వారంటైన్ లో కూడా ఉండాలని తెలిపాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here