మరో బాలీవుడ్ నటికి కరోనా పాజిటివ్

Advertisement

ఇప్పటికే బాలీవుడ్ లో చాలామంది ప్రముఖులు కరోనా భారిన పడ్డ విషయం తెలిసిందే. కరోనా భారిన పడ్డ బచ్చన్ కోలుకుని ఇంటి తిరిగి వెళ్లిన విషయం తెలిసిందే. అలాగే నటి జెనీలియా కూడా కరోనా భారిన పడ్డారు. అయితే ఇప్పుడు మరో బాలీవుడ్ నటి, ఐటమ్ సాంగ్స్‌కు ఫేమ్ మలైనా అరోరా కరోనా వైరస్‌ బారిన పడింది. ప్రస్తుతం ఆమె హోం క్వారంటైన్‌లో ఉంది.

46 ఏళ్ల నటి తనకు పాజిటివ్‌గా తేలినట్లు ఇన్‌స్టాగ్రామ్‌లో సోమవారం వెల్లడించింది. ‘ఈ రోజు కొవిడ్‌ పరీక్షలు నిర్వహించుకోగా పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం ఎలాంటి లక్షణాలు లేవు. క్షేమంగా ఉన్నానని’ వెల్లడించింది. అలాగే మలైకా ఫ్రెండ్ అర్జున్ కపూర్ కూడా ఆదివారం కరోనా భారినపడ్డట్టు వెల్లడించాడు. అర్జున్ కూడా ఇప్పుడు వైద్యుల సలహా మేరకు హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here