బాలీవుడ్ లో మరో నటుడికి కరోనా

Advertisement

కరోనా రోజురోజుకు దారుణంగా విస్తరిస్తుంది. ఇక ఇప్పటికే సామాన్యులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ మహమ్మారి బారిన పడ్డారు. ఇక దింట్లో చాలా వరకు కోలుకొని మాములు స్థితికి వచ్చారు. ఇక బాలీవుడ్ లో ఇప్పటికే చాలా మంది నటి నటులు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటె తాజాగా మరో బాలీవుడ్ నటుడు అఫ్తాబ్‌ శివదాసానికి కరోనా పాజిటివ్ గా తేలింది. అయితే ఈ విషయాన్నీ ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు.

అయితే తన ట్వీట్ లో.. ‘అందరికీ హలో మీరంతా ఫిట్‌గా.. చక్కగా ఉన్నారని, మీ గురించి మీరు శ్రద్ధ తీసుకుంటున్నారని కోరుకుంటున్న.. తాజాగా నేను పొడి దగ్గు, తేలికపాటి జ్వరం లక్షణాలు కనిపించడంతో టెస్టులు చేయించుకున్నాను. దురదృష్టవశాత్తు కరోనా పాజిటివ్ గా వచ్చింది. ఇక వైద్యుల సూచన మేరకు హోం క్వారంటైన్‌లో ఉంటున్నా’ అని ట్వీట్‌ చేశాడు. అలాగే తనతో కొన్ని రోజులుగా సన్నిహితంగా ఉన్నవారు కూడా టెస్టులు చేయించుకోవాలి అని ఆయన సూచించాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here