బీజేపీ అధ్యక్షుడికి కరోనా

Advertisement

దేశ వ్యాప్తంగా కరోనా ఉగ్రరూపం దాల్చుతుంది. ఇక ఇప్పటికే చాలా మంది ప్రముఖులు ఈ మహమ్మారి బారిన పడ్డారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధులు చాలా మంది కూడా కరోనా సోకింది. అయితే తాజాగా ఉత్తరాఖండ్‌ బీజేపీ అధ్యక్షుడు బన్షిధర్‌ భగత్‌ కరోనా బారిన పడ్డారు. కరోనా లక్షణాలు ఉండడంతో నిన్నటి రోజున టెస్టులు చేయించున్నాడు. దీనితో ఆ టెస్టుల్లో కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. ఇక ఈ విషయాన్నీ ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు.

అలాగే గత వారం రోజులుగా తనను కలిసిన పార్టీ కార్యాలయ సిబ్బంది, కార్యకర్తలు కరోనా పరీక్షలు చెయించుకోవాలి అని పేర్కొన్నారు. అయితే ఆగస్టు 24న డెహ్రాడూన్‌లోని ఆయన నివాసంలో పార్టీ సమావేశం నిర్వహించారు. ఇక ఈ సమావేశంలోనే కరోనా సోకినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here