అమెజాన్ లో మరో భారీ సినిమా
Admin - August 22, 2020 / 10:59 AM IST

కరోనా వైరస్ దృష్ట్యా సినిమా థియేటర్లు అన్ని కూడా మూతపడ్డాయి. దీనితో సినిమాలు అన్ని కూడా ఓటిటి ఫ్లాట్ ఫర్మ్ ద్వారా విడుదల అవుతున్నాయి. తాజాగా స్టార్ హీరో సూర్య సినిమా కూడా ఓటీటీ రిలీజ్ కు సిద్ధం అవుతుంది. అయితే లేడీ డైరెక్టర్ సుధా కొంగర దర్శకత్వంలో సూర్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ సూరారయి పొట్టారు తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా’. ఈ సినిమాలో అపర్ణ బాలమురళి హీరోయిన్ గా కనిపించనుంది.
ఇక ఈ సినిమా తెలుగు, తమిళ్, మలయాళం మరియు కన్నడ భాషల్లో విడుదల అవ్వనుంది. ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ లో డిజిటల్ ప్రీమియర్ గా రిలీజ్ చేయనున్నారు. ఆకాశం నీ హద్దురా సినిమా వచ్చే అక్టోబర్ 30 వ తేదీన స్ట్రీమింగ్ కానుంది. అయితే వినాయక చవితి సందర్భంగా సూర్య ఈ ప్రకటన చేశాడు. దీనితో అభిమానులకు ఇది ఊహించని సర్ ప్రైస్ అని చెప్పాలి.