రామ్ పోతినేనికి మరో మంత్రి హెచ్చరిక

Advertisement

విజయవాడ రమేష్ ఆసుపత్రిలో జరిగిన అగ్ని ప్రమాద విషయానికి స్పందించిన రామ్ పోతినేని తాను ట్విట్టర్ లో పెట్టిన ఒక పోస్ట్ తీవ్ర దుమారం లేపింది. అయితే రామ్ పెట్టిన పోస్ట్ ప్రస్తుతం చర్చనీయ అంశంగా మారింది. ఇప్పటికే తన పెట్టిన పోస్టుకు పలువురు స్పందించారు. ఇది ఇలా ఉంటె తాజాగా మంత్రి కోడలి నాని కూడా స్పందించారు. ఇక కొడాలి నాని వార్నింగ్ ఇవ్వడం తో హాట్ టాపిక్ గా మారింది. అయితే విజయవాడ రమేష్ హాస్పిటల్ కొవిడ్ కేర్ సెంటర్ లో మృతి చెందిన బాధిత కుటుంబాలకు 50 లక్షలు ఎక్స్‌గ్రేషియాను నేడు అందజేశారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు ఆళ్ల నాని, పెద్దిరెడ్డి, వెల్లంపల్లి మరియు కొడాలి నాని కలిసి బాధిత కటుంబాలకు చెక్కులు పంపిణి చేసారు. అయితే రమేష్ ఆసుపత్రి యజమాని రమేష్ వెనుక చాలా మంది పెద్ద వ్యక్తులు ఉన్నారని అన్నాడు. రమేష్ ఎక్కడ తలదాచుకున్నాడో రాష్ట్ర ప్రజలకు తెలుసనీ అన్నాడు. అలాగే హీరో రామ్ తన బాబాయి మాటలు విని ఏదో మాట్లాడడం మంచిది కాదని హెచ్చరించాడు. రమేష్ తప్పు చేయకపోతే విచారణకు ఎందుకు రావడం లేదని కోడలి నాని ప్రశ్నించాడు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here