ఏపీలో మరో మంత్రికి కరోనా పాజిటివ్

Advertisement

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు దారుణంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే రోజుకు పది వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. దీనితో ఏపీ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఒకవైపు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ప్రజా ప్రతినిదులు చాలా మంది కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటె తాజాగా ఏపీలో మరో మంత్రికి కరోనా సోకింది.

అయితే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. దీనితో ఆయన హైదరాబాద్ లోని ‌ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక ఆయనకు కరోనా సోకడంతో తనను కలిసిన పార్టీ కార్యకర్తలు, సన్నిహితులు ఆందోళన చెందుతున్నారు. అలాగే తూర్పుగోదావరి జిల్లాలోని కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డికి కూడా కరోనా సోకింది. ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 4,31,876 కేసులు నమోదయ్యాయి.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here